TGTET జూన్ 2026 అఫీషియల్ ఎగ్జామ్ షెడ్యూల్:
TGTET జూన్ 2026 అఫీషియల్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల: మీ పరీక్ష తేదీ, షిఫ్ట్ టైమింగ్స్ చూసుకోండి!
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET జూన్ 2026) అధికారిక పరీక్షా షెడ్యూల్‌ను SCERT డైరెక్టర్ & కన్వీనర్ విడుదల చేశారు తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు ఇది చాలా కీలకమైన సమయం.
ఈ పరీక్షలు జూన్ 16, 2026 నుండి జూన్ 22, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరగనున్నాయి. మీ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవడానికి వీలుగా పూర్తి టైమ్‌టేబుల్, షిఫ్ట్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
*⏱️ TGTET 2026 పరీక్షా సమయాలు (Shift Timings)
ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. మీ షిఫ్ట్ సమయాన్ని జాగ్రత్తగా గమనించండి:
* షిఫ్ట్ 1 (ఉదయం సెషన్):
ఉదయం 09:00 గంటల నుండి 11:30 గంటల వరకు
* షిఫ్ట్ 2 (మధ్యాహ్నం సెషన్): మధ్యాహ్నం 02:00 గంటల నుండి 04:30 గంటల వరకు
సంపూర్ణ TGTET జూన్ 2026 పరీక్షా షెడ్యూల్:
మీరు రాసే పేపర్, మీడియం మరియు మీకు కేటాయించిన జిల్లాల వారీగా పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఫేజ్ 1: పేపర్-I (ఇంగ్లీష్ / తెలుగు మీడియం)
* జూన్ 16, 2026 (షిఫ్ట్ 1): ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట.
* జూన్ 16, 2026 (షిఫ్ట్ 2): జనగామ, కరీంనగర్, ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్.
* జూన్ 17, 2026 (షిఫ్ట్ 1): హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి మరియు ఇతర ప్రాంతాలు.
ఫేజ్ 2: పేపర్-II మ్యాథమెటిక్స్ & సైన్స్ (ఇంగ్లీష్ / తెలుగు మీడియం)
* జూన్ 17, 2026 (షిఫ్ట్ 2): ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి మరియు ఇతర ప్రాంతాలు.
* జూన్ 18, 2026 (షిఫ్ట్ 1): జనగామ, కరీంనగర్, ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి.
* జూన్ 18, 2026 (షిఫ్ట్ 2): హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ఫేజ్ 3: పేపర్-II సోషల్ స్టడీస్ (ఇంగ్లీష్ / తెలుగు మీడియం)
* జూన్ 19, 2026 (షిఫ్ట్ 1): ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి మరియు ఇతర ప్రాంతాలు.
* జూన్ 19, 2026 (షిఫ్ట్ 2): జనగామ, కరీంనగర్, ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి.
ఫేజ్ 4: మైనర్ లాంగ్వేజెస్ (అన్ని జిల్లాలు)
* జూన్ 22, 2026 (షిఫ్ట్ 1): పేపర్-II (మ్యాథ్స్, సైన్స్ & సోషల్ స్టడీస్) – మైనర్ మీడియమ్స్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం).
* జూన్ 22, 2026 (షిఫ్ట్ 2): పేపర్-I – మైనర్ మీడియమ్స్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ).
📌 అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:
1. జిల్లా కేటాయింపును సరిచూసుకోండి:
ఈ షిఫ్ట్‌లు జిల్లాల వారీగా విభజించబడ్డాయి. కాబట్టి మీ హాల్ టికెట్లో ఉన్న జిల్లా, తేదీ మరియు సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
2. పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోండి:
బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి, పరీక్ష సమయానికి కనీసం 60 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవడం మంచిది.
3 మైనర్ లాంగ్వేజ్ అభ్యర్థు.లు:
మైనర్ మీడియం అభ్యర్థులకు కేవలం చివరి రోజైన జూన్ 22న మాత్రమే పరీక్షలు జరుగుతాయని గమనించగలరు.
📊 TGTET ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక పరిశీలన
- మొత్తం మార్కులు: 150 మార్కులు (మొత్తం 150 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు - MCQs)
- నెగెటివ్ మార్కింగ్: ఈ పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
- అర్హత మార్కులు (Qualifying Marks):
- జనరల్ (OC): 60% మరియు అంతకంటే ఎక్కువ (90 మార్కులు)
- BC అభ్యర్థులు: 50% మరియు అంతకంటే ఎక్కువ (75 మార్కులు)
- SC/ST/దివ్యాంగులు (PH): 40% మరియు అంతకంటే ఎక్కువ (60 మార్కులు).
📥 TGTET 2026 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?పరీక్షకు కొన్ని రోజుల ముందు అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. డౌన్లోడ్ చేసుకునే విధానం:తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ ( https://tgtet.aptonline.in పోర్టల్) సందర్శించండి.హోమ్ పేజీలో కనిపించే 'TGTET June 2026 Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయండి.మీ (Registration ID) మరియు పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.
పరీక్ష రోజున పాటించాల్సిన ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు :
హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
రిపోర్టింగ్ టైమ్:
పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి కనీసం 1 గంట ముందే సెంటర్‌కు చేరుకోండి. గేట్లు మూసివేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు.ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం:
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్లు మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్! ఇంకా అదనపు సమాచారం కోసం టెట్ అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in
సందర్శించండి.
For more information about any educational related
Please visit my blog
